ఇండో- పసిఫిక్ తీరప్రాంత భద్రతలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగుతామని భారత్, శ్రీలంక, మాల్దీవులు ప్రకటించాయి.
శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన త్రైపాక్షిక సమావేశంలో ఈ మేరకు మూడు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పాల్గొన్నారు. ఆరేళ్ల విరామం తర్వాత నిర్వహించిన ఈ సమావేశానికి భారత్ నుంచి డోభాల్, శ్రీలంక రక్షణశాఖ కార్యదర్శి మేజర్ జనరల్ కమల్ గుణరత్నే, మాల్దీవులు రక్షణ మంత్రి మారియా దీదీ హాజరయ్యారు.
సమావేశంలో పాల్గొన్న అజిత్ డోభాల్ సంయుక్త ప్రకటనను విడుదల చేస్తున్న ప్రతినిధులు భారత్, శ్రీలంక, మాల్దీవులు త్రైపాక్షిక భేటీ ఈ త్రైపాక్షిక భేటీలో ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతకు అనుసరించాల్సిన ఉమ్మడి భాగస్వామ్యం, వ్యూహాలపై చర్చించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రించటం, సముద్ర కాలుష్యం, తీర ప్రాంతాల భద్రతకు సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవటంపై చర్చ జరిగింది. ఇటీవల ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:గురునానక్ జయంతి ఉత్సవాలకు 600 మంది సిక్కులు