తెలంగాణ

telangana

ETV Bharat / international

గాంధీ జయంతి సందర్భంగా నేపాల్​కు భారత్​ బహుమతులు

జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకొని నేపాల్​కు పలు వాహనాలను బహూకరించింది భారత్. ఆ దేశంలో విద్య, వైద్య సేవలను మెరుగుపరచడంలో భాగంగా.. అంబులెన్స్​లు, పాఠశాల బస్సులను అందించినట్టు నేపాల్​లోని భారత దౌత్య కార్యాలయం తెలిపింది.

India gifts 41 ambulances and 6 school buses to Nepal on Gandhi Jayanti
గాంధీ జయంతి సందర్భంగా నేపాల్​కు, భారత్​ వాహనాల గిఫ్ట్​

By

Published : Oct 2, 2020, 2:47 PM IST

మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా.. నేపాల్​కు 41 అంబులెన్స్​లు, 6 స్కూల్​ బస్సులను బహుమతిగా ఇచ్చింది భారత్​. నేపాల్​లోని 29 జిల్లాల్లో లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న సంస్థలకు ఈ కానుక అందించినట్టు అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

కొవిడ్​పై నేపాల్ చేస్తున్న పోరాటానికి సాయంగా ప్రాథమిక వైద్య సదుపాయాలు కలిగిన అత్యవసర వాహనాలను అప్పగించింది భారత్​. ఇందులో ట్రావెలింగ్​ వెంటిలేటర్లు, ఈసీజీ సౌకర్యం, ఆక్సిజన్​ మానిటర్​ వంటి అధునాతన సౌకర్యాలు ఉంటాయని దౌత్య కార్యాలయం పేర్కొంది. దీంతో 1994 నుంచి ఇప్పటి వరకు నేపాల్​కు భారత్​ బహూకరించిన అంబులెన్స్​ల సంఖ్య 823కు పెరిగింది. ఈ అంబులెన్స్​లు. అడ్వాన్స్​ లైఫ్​ సపోర్ట్​ కేటగిరీ, బేసిక్​ లైఫ్​ సపోర్ట్​ కేటగిరీ, కామన్​ లైఫ్​ సపోర్ట్​ను కలిగి ఉంటాయి. ఇవన్నీ నేపాల్​ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూపొందించారు.

విద్య, వైద్య సేవల కోసం..

హిమాలయ దేశంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా ఆరు పాఠశాల బస్సులను అప్పగించింది భారత్​. వీటితో కలిపి ఆ దేశానికి మొత్తంగా 160 బస్సులు ఇచ్చినట్లైంది. అక్కడ విద్య, ఆరోగ్య వసతులను బలోపేతం చేయడంలో భాగంగా.. భారత్ ఇలా పాఠశాలల బస్సులు, పుస్తకాలు, అంబులెన్స్​లు వంటివాటిని బహుమతిగా ఇస్తోంది. అంతేకాకుండా అక్కడి అనేక ప్రాజెక్టుల కోసం నిధులను కూడా సమకూరుస్తోంది భారత్​.

ఇదీ చదవండి:మహాత్ముడికి అమెరికా చట్టసభ్యుల నివాళి

ABOUT THE AUTHOR

...view details