తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయి. మూడు అంచెలలో ఇరు దేశాల బలగాల ఉపసంహరణకు, ఇటీవల నిర్మించిన నిర్మాణాలను ఇరు దేశాలు కూల్చివేసేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఇరు దేశాలు ఏప్రిల్ నుంచి భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ కొన్ని మౌలిక వసతులను నిర్మించాయి. వీటిని కూల్చివేయడంతోపాటు దళాలను తిరిగి ఏప్రిల్-మే నెలలకు ముందు ఉన్న చోట్లకు తీసుకెళ్ళడానికి తాజాగా అంగీకారం కుదిరినట్లు సమాచారం. మూడు అంచెల ఉపసంహరణ ప్రక్రియ నిర్ణీత కాలంలో పూర్తి అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మొదట పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఇరు దేశాలు తమ తమ ట్యాంకులు, సాయుధ సిబ్బంది వాహనాలను ఎల్ఏసీ నుంచి దూరంగా తరలిస్తాయి. ఈ ప్రక్రియ ఒక్క రోజులో పూర్తవుతుంది.
ఇదీ చూడండి: 'మూడంచెల చైనా 'ప్రణాళిక'తో భారత్‌కే నష్టం'