India China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఏడాదిన్నరగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తుంటే.. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. వివాదస్పద ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరిస్తోంది. నిత్యం 60 వేల మంది చైనా సైనికులు పహారా కాస్తున్నాయి.
"వేసవి శిక్షణ కోసం భారత సరిహద్దుల్లో చైనా భారీగా తమ బలగాలను మోహరించింది. ఫలితంగా వారి సంఖ్య పెరిగింది. వారు ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఇప్పటికీ సరిహద్దుల్లోని వివాదస్పద ప్రాంతాల్లో 60 వేల మంది సైనికులు ఉన్నారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు అత్యవసర సమయంలో బలగాలు, ఆయుధ సామాగ్రిని సరిహద్దులకు తరలించేందుకు సరిహద్దు వెంబడి యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు మెరుగుపరుస్తోంది చైనా. పాంగాంగ్ సరస్సుపై వంతెన నిర్మిస్తోంది.