హిందూ మహాసముద్రంలో కోరలు చాస్తున్న చైనాకు ముకుతాడు వేయడానికి భారత్ దూకుడు పెంచింది. సువిశాల మహాసాగరంలో డ్రాగన్ కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా మారిషస్‌కు చెందిన ఉత్తర అగలేగా దీవిలో ఒక నౌకాదళ స్థావరాన్ని (Agalega Indian Military base) సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని మారిషస్, భారత్ ప్రభుత్వాలు ఖండిస్తున్నప్పటికీ.. అక్కడి పరిస్థితులపై మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్కడి నిర్మాణాలు నిర్దిష్టంగా సైనిక అవసరాలకు ఉద్దేశించినవేనంటూ పలు పత్రాలు, అధికార వర్గాలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తున్నాయి. (Agalega Indian Military base) ముఖ్యంగా నిఘా కార్యకలాపాల కోసమే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్లు అవి స్పష్టం చేస్తున్నాయి. (Indian Military base in Mauritius)
25 కోట్ల డాలర్లతో..
ఉత్తర అగలేగాలో నిర్మాణాల కోసం వందల మంది భారత కార్మికులు పనిచేస్తున్నారు. (Agalega Island Indian Army) అయితే హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశాల నడుమ మౌలిక వసతుల అభివృద్ధి కోసం తాము తెచ్చిన 'సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్' (సాగర్) విధానంలో భాగంగానే మారిషస్‌లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని (Agalega Island Indian Army) భారత్ స్పష్టంచేస్తోంది. మరోవైపు.. ఈ స్థావరంలోని కొత్త వసతులను తమ తీరరక్షక దళ సిబ్బంది మాత్రమే వినియోగించుకుంటారని మారిషస్ పేర్కొంది. అయితే ఈ మారుమూల దీవిలో 25 కోట్ల డాలర్లను వెచ్చించి వైమానిక స్థావరం, పోర్టు, కమ్యూనికేషన్స్ హబ్‌ను భారత్ అభివృద్ధి చేయడం వెనుక ఉద్దేశం కేవలం తన ప్రాదేశిక జలాలను కాపాడుకునేలా మారిషస్‌కు సాయం చేయడం ఒక్కటే కాదు.
కీలక స్థానం..
ఉత్తర, దక్షిణ అగలేగా దీవులు హిందూ మహాసముద్రంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన వాయవ్య ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ దాదాపు 300 మంది క్రియోల్ అగలీన్ జాతివారు ఉంటున్నారు. ఆ ప్రాంతానికి చుట్టుపక్కల నిఘా వేయడానికి భారత నౌకాదళానికి సాధ్యం కావడంలేదు. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సాగరంలో జరుగుతున్న పరిణామాలను మరింత క్షుణ్నంగా తెలుసుకోవడానికి వీలవుతుందని భారత్ భావిస్తోంది.
భారీగా వసతులు..