తెలంగాణ

telangana

ETV Bharat / international

'2022లో భారత్​-బంగ్లాదేశ్​ మధ్య రైలు కూత'

2021 చివరి నాటికి భారత్​-బంగ్లాదేశ్​ మధ్య రైలు మార్గ నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 2022 ఆగస్టు 15న త్రిపురలోని అగర్తలా నుంచి బంగ్లాదేశ్​లోని అఖౌరా మధ్య తొలి రైలు పట్టాలెక్కనుందని స్పష్టం చేశారు.

india-bangladesh-rail-link-to-be-ready-by-2021-minister-singh
'2022లో భారత్​-బంగ్లాదేశ్​ మధ్య రైలు కూత'

By

Published : Feb 9, 2020, 11:57 PM IST

Updated : Feb 29, 2020, 7:46 PM IST

భారత్​-బంగ్లాదేశ్​ మధ్య రైలు ప్రయాణాన్ని సాధ్యమైనంత తొందరగా ప్రారంభించేందుకు కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఇరుదేశాల మధ్య రైలు మార్గాన్ని వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేయనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ప్రకటించారు. భారత​ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని 2022 ఆగస్టు 15న తొలి రైలు పట్టాలెక్కనుందని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్​తో కలుపుతూ.. త్రిపురలోని అగర్తలా నుంచి బంగ్లాదేశ్​లోని అఖౌరా మధ్య ఈ రైలు కూతపెట్టనున్నట్లు తెలిపారు.

రైలు మార్గానికి కావలసిన భూసేకరణ పూర్తయిందని తెలిపిన జితేంద్ర సింగ్.. ఈ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 580 కోట్లు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 600 మంది ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు 24 గంటలపాటు పని చేస్తున్నట్లు వివరించారు.

2014 ముందు రైల్వే మార్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అరుణాచల్​ ప్రదేశ్​, మేఘాలయ రాష్ట్ర పజలకు అసలు రైలు అంటే ఏమిటో కూడా తెలియదని అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత .. ప్రస్తుతం దిల్లీ నుంచి ఐతానగర్​కు అరుణాచల్​ ఎక్స్​ప్రస్​ రైలు నడుస్తోందని తెలిపారు. త్వరలో ఈ ప్రాంతానికి డబుల్​ గేజ్​ ట్రాక్​ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఉద్యోగాల్లో రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించరాదు'

Last Updated : Feb 29, 2020, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details