తెలంగాణ

telangana

ETV Bharat / international

'సిక్కుల పవిత్ర కట్టడాన్ని పరిరక్షించండి'​ - సిక్కుల పవిత్ర కట్టడాన్ని పరిరక్షించండి: భారత్​

పాకిస్థాన్​లోని సిక్కుల పవిత్ర స్థలం కర్తార్​పుర్​ సాహెబ్​ గురుద్వారా కట్టడం గోపురాలు కూలిపోవటంపై సిక్కు సమాజం భయాందోళనలకు గురవుతున్నట్లు పాక్​ అధికారులకు భారత్​ వివరించింది. వెంటనే గోపురాలకు మరమ్మతలు చేయించాలని కోరింది.

India asks Pak to look into reasons behind collapse of domes of Kartarpur Gurudwara
సిక్కుల పవిత్ర కట్టడాన్ని పరిరక్షించండి: భారత్​

By

Published : Apr 19, 2020, 8:10 PM IST

సిక్కులకు ప్రవిత్ర స్థలమైన కర్తార్​పుర్​ సాహెబ్​ గురుద్వారా కట్టడం గోపురాలు కూలిపోయిన విషయంపై పాకిస్థాన్​ ప్రభుత్వంతో మాట్లాడినట్లు భారత్ అధికారులు వెల్లడించారు. దీనిపై సిక్కు సమాజం ఆందోళనకు గురవుతున్న విషయాన్ని పాక్​కు వివరించినట్లు తెలిపారు.

"సిక్కు సమాజం మనోభావాలను అర్థం చేసుకుని కూలిన వాటికి మరమ్మతులు చేయించాలని పాకిస్తాన్‌ను భారత్​ కోరింది. చారిత్రాక కట్టడంలోని నూతన నిర్మాణాలకు నష్టం కలిగించే విధంగా లోపాలను అత్యవసరంగా సరిచేయాలని సూచించింది."

-భారత అధికార వర్గాలు

గురునానక్‌ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు వీసా అవసరం లేకుండా పాక్‌లోని కర్తార్‌పుర్‌లో ఉన్న.. దర్బార్ సాహిబ్‌ గురుద్వారాను దర్శించుకునే వీలుగా భారత్​- పాక్​ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి. దీనికోసం కర్తార్​పూర్​ కారిడార్​ను నిర్మించాయి. నవంబర్​ 9న భారత్‌ వైపు ఉన్న కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details