భారత్, చైనాల మధ్య 9వ విడత కార్ప్ కమాండర్ స్థాయి చర్చలు.. ఆదివారం(ఈనెల 24న) జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించే దిశగా ఈ సమావేశాలు జరగనున్నాయి. భారత్‌లోని చుషుల్ మోల్దో సెక్టార్ వద్ద ఈ భేటీ జరగనుందని సమాచారం.
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చైనా అంగీకరిస్తే తప్ప.. భారత్ తన బలగాలను ఉపసంహరించుకోదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు.