తూర్పు లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టే విషయంలో.. భారత్, చైనాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చర్చల ద్వారా.. పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని శుక్రవారం నిర్ణయించాయి. ఈ మేరకు ఇరుదేశాల దౌత్యవేత్తల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
"తూర్పులద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ కోసం..12వ విడత సైనిక చర్చలు త్వరలో నిర్వహించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. గతేడాది ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మధ్య కుదిరిన ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసి వెంట మిగిలిన సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి అంగీకరించాయి."
-భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ