పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)పై భారత్ సూచనలను ఆ రెండు దేశాలు ఖాతరు చేయలేదని కేంద్రం వెల్లడించింది.
భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికాన్ని బేఖాతరు చేస్తున్నాయని.. లోక్ సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు.పీఓకే మీదుగా వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) పేరుతో నిర్మించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనాకు సూచించినట్లు వెల్లడించారు.
"చైనా ఓబీఓఆర్ నిర్మాణాన్ని అడ్డుకునే అంశంపై.. ప్రభుత్వం స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ఉంది. " --- వి.మురళీధరన్, కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయక మంత్రి