ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా గురువారం శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజు సందర్భంగా నేతలు ఇద్దరూ ఫోన్లో సంభాషించుకున్నట్లు పేర్కొంది విదేశాంగ శాఖ. భారత ప్రధానికి పుతిన్ శుభాకాంక్షలు చెప్పారని.. ప్రతిగా మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల్లో పుతిన్ నిబద్ధతపై మోదీ సంతోషం వ్యక్తం చేశారని, భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశాలకు ఆయనను స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారని స్పష్టం చేసింది ఎంఈఏ.
''భారత్-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని మోదీ, పుతిన్ పునరుద్ఘాటించారు. కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలపై నిరంతరం శ్రద్ధ చూపుతున్నందుకు పరస్పరం ప్రశంసించుకున్నారు.''
- భారత విదేశాంగ శాఖ