తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాలో కొవిడ్ కల్లోలం- రోగులతో ఆసుపత్రులు ఫుల్​! - రష్యాలో నిండిన కరోనా రోగుల బెడ్లు

రష్యాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాగే కొనసాగితే పడకలు దొరకటం కష్టమేనని అధికారులు తెలిపారు.

covid
కరోనా

By

Published : Nov 11, 2021, 6:47 AM IST

రష్యాలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. మరణాల సంఖ్య అదే స్థాయిలో పెరగడం వల్ల ఆ దేశంలో కొవిడ్​ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ఆసుపత్రుల్లోని 83 శాతం కొవిడ్​ పడకలు నిండినట్లు అధికారులు తెలిపారు.

కొవిడ్​ రోగుల కోసం రిజర్వు చేసిన మూడు లక్షలపైగా పడకలలో 82.8 శాతం మేరు నిండినట్లు ఆ దేశ ఉప ప్రధాని టాట్యానా గోలికోవా ఓ సమావేశంలో వెల్లడించారు. వైరస్​ అదుపులో ఉందని తాము ఇప్పటికీ చెప్పలేమని అన్నారు. దేశంలో వైరస్​ కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

కరోనా మరణాలు బుధవారం భారీ స్థాయిలో వెలుగు చూశాయి. మంగళవారం 1,211 కేసులు నమోదు కాగా బుధవారం నాటికి ఆ సంఖ్య 1,239కు పెరిగింది. మరోవైపు 38,058 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ చివరి నుంచి సగటున ప్రతిరోజూ 40,000 కేసులు, 1,100 మరణాలు నమోదవుతున్నాయి.

కేసులను అదుపు చేయడానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుండడం వల్ల వైరస్​ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. అంతేగాకుండా వ్యాక్సినేషన్ రేటు కూడా చాలా తక్కువగా ఉండడం స్థానిక అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. పూర్తి జనాభా 146 మిలియన్లుగా ఉంటే వారిలో కేవలం 40 శాతం మంది కూడా పూర్తి స్థాయిలో టీకా తీసుకోలేదు. అయితే దేశంలో ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్​కు పుతిన్ సర్కార్​ నెలల కిందటే ఆమోదం తెలిపటం గమనార్హం.

ఇదీ చూడండి:'ఐరోపాలో కరోనా ఉగ్రరూపం.. ఇలానే కొనసాగితే ఐదు లక్షల మరణాలు...'

ABOUT THE AUTHOR

...view details