ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో కార్చిచ్చు మళ్లీ చెలరేగింది. దట్టంగా విస్తరిస్తున్న పొగ.. సిడ్నీ నగరాన్ని కమ్మేసింది. ఫలితంగా అధికారులు ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు విజృంభణ.. పొగమయమైన సిడ్నీ
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు మరోమారు విజృంభించింది. దావానలం వేగంగా జనావాసాల వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో సిడ్నీ నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు అధికారులు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు - పొగతో కమ్ముకున్న సిడ్నీ
ఈదురుగాలుల ధాటికి తీవ్రస్థాయిలో చెలరేగుతున్న మంటలతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయాయి. బయట వీస్తున్న వేడిగాలులు, చెలరేగుతున్న మంటల ధాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి : దిశ కేసులో ముందడుగు.. ఫాస్ట్‌ట్రాక్ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం
Last Updated : Dec 4, 2019, 8:23 PM IST