తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​​ జైలులో హఫీజ్​ సయీద్ సెటిల్మెంట్ దందా - saeed in lahore jail

అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్​ సయీద్​.. పాక్​ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నాడనేందుకు మరో ఆధారం దొరికింది. ఓ  పోలీసు కస్టడీలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబం, అధికారుల మధ్య సయోధ్య కుదిర్చాడు సయీద్​. ఈ విషయాన్ని బాధిత కుటుంబంతో పాటు అధికారులూ ధ్రువీకరించారు.

PAK-SAEED

By

Published : Oct 22, 2019, 5:53 PM IST

పాకిస్థాన్​లోని జైలులో ఉన్న ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​కు సకల రాజభోగాలు అందుతున్నాయి. లాహోర్​లోని కోట్​ లఖ్​పత్​ కారాగారంలో ఉంటున్న అతడు పోలీసులు, ఖైదీల మధ్య వివాదాలను పంచాయితీల ద్వారా పరిష్కరిస్తున్నాడు.

తాజాగా జరిగిన ఓ బడా​ సెటిల్మెంట్​ను చూస్తే హఫీజ్​ పాక్​ జైలులో ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నాడో అర్థం అవుతుంది. పోలీసు కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబం, అధికారుల మధ్య వివాదాన్ని సయీద్​ పరిష్కరించినట్లు సమాచారం.

ఏటీఎం చోరీ కేసులో..

గత నెలలో ఏటీఎం దొంగతనం కేసులో అనుమానితుడు, మతిస్థిమితం లేని సలాబుద్దీన్ అయూబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయూబీ కస్టడీలోనే మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల కారణంగానే అతను మరణించాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అయూబీ కుటుంబ సభ్యులను సయీద్​ కలిశారు. కేసుతో సంబంధమున్న పోలీసులను క్షమించి వదిలేయాలని వారిని ఒప్పించాడు. ఇందుకు ఆయూబీ కుటుంబం నివసిస్తున్న గుజ్రన్​వాలాకు రూ.80 కోట్లతో రోడ్డు, గ్యాస్ సరఫరా ఏర్పాటు చేసేలా పోలీసులతో సయీద్​ ఒప్పందం చేసుకున్నాడని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.

"ఆయూబీ కుటుంబంలో సయీద్​ అభిమానులు ఉన్నారు. ఫలితంగా సయీద్​తో కుటుంబ సభ్యులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు పోలీసులు. రెండు వైపుల వాదనలు విన్న సయీద్​ బాధిత కుటుంబానికి 3 అవకాశాలు ఇచ్చాడు. అవి... పోలీసుల నుంచి డబ్బు లేదా దేవుని పేరుమీద క్షమించి వదిలేయటం లేదా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం. క్షమించి వదిలేయాలని కుటుంబం నిర్ణయించుకుంది."

- ప్రభుత్వ అధికారి, పాకిస్థాన్

ధ్రువీకరించి బాధిత కుటుంబం

ఆయూబీ కుటుంబం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మృతుడి తండ్రి అఫ్జల్​ ఘుమ్మన్​ ఈ విషయం నిజమేనని తెలిపాడు. సయీద్​ ఆదేశాల మేరకు పంజాబ్​ గవర్నర్​ చౌదురి సర్వార్​ రోడ్డు, గ్యాస్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పాడు.

2016లో సయీద్​ స్థాపించిన ఉగ్రసంస్థ జమాత్​ ఉద్​ దవా.. పంజాబ్​లో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న ఆరోపణలతో దర్యాప్తు ప్రారంభించింది పాక్. లాహోర్​లోని సంస్థ కార్యాలయంలో ఎన్నో సెటిల్​మెంట్లు జరిగేవి. ఇవన్నీ రుజువైనా వారిపై చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.

ఇదీ చూడండి: జాతీయ నేతకు చెప్పుల దండ, గాడిదపై ఊరేగింపు!

ABOUT THE AUTHOR

...view details