తెలంగాణ

telangana

ETV Bharat / international

మహిళా జడ్జిల కోసం వేట.. మాకే శిక్ష వేస్తారా అంటూ... - అఫ్గానిస్థాన్​ తాలిబన్లు తాజా వార్తలు

అఫ్గాన్​లో తాలిబన్లు(Afghanistan Taliban) అధికారం చేపట్టిన తర్వాత.. ​గత ప్రభుత్వంలో న్యాయమూర్తులుగా సేవలందించిన మహిళలు ఎంతో భయాందోళనకు లోనవుతున్నారు. ప్రాణభయంతో బయటకు అడుగుపెట్టకుండా కాలం వెళ్లదీస్తున్నారు. అయితే.. వారికి ఎవరి నుంచి ముప్పు పొంచి ఉంది? అంతలా భయపడటానికి వారు చేసిందేంటి?

afghan women judges
అఫ్గాన్​లో మహిళా జడ్జిలు

By

Published : Sep 29, 2021, 5:27 PM IST

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు(Afghanistan Taliban) ఆక్రమించుకున్నాక అక్కడ జరిగిన పరిణామాలను.. ప్రపంచమంతా చూసింది. ఎంతో మంది పౌరులు తమ దేశాన్ని(Afghanistan Taliban) వీడి పారిపోయే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు వెలుగు చూశాయి. అయితే.. అదే తరహాలో అఫ్గాన్(Afghanistan News)​ గత ప్రభుత్వంలో న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించిన మహిళలు.. ఇప్పుడు భయాందోళనకు లోనవుతున్నారు. కొందరు ఇప్పటికే తమ దేశాన్ని వీడి వెళ్లారు. అలా వెళ్లలేని వాళ్లు మాత్రం ప్రతిరోజు ప్రాణ భయంతో.. రహస్య ప్రదేశాల్లో దాక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఎందుకు వారికి భయం?

అఫ్గాన్​ను గత నెలలో ఆక్రమించుకున్న వెంటనే తాలిబన్లు(Afghanistan Taliban).. ఎంతో మంది నేరగాళ్లకు విముక్తి ప్రసాదించారు. వారిని జైళ్ల నుంచి విడుదల చేశారు. అలా విడుదలైన వారిలో చాలా మంది వివిధ నేరాల్లో దోషులుగా తేలిన వారే. వారికి శిక్ష విధించడమే ఈ మహిళా న్యాయమూర్తుల భయాందోళనకు కారణం.

జైలు నుంచి విడుదలైన నేరస్థులు.. న్యాయమూర్తుల కోసం గాలిస్తున్నారు. తమకు శిక్ష వేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో 220 మందికిపైగా మహిళా జడ్జిలు ప్రాణ భయంతో దాక్కున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆ న్యాయమూర్తుల్లో చాలా మంది మహిళా హక్కుల కోసం ఉద్యమించినవారే ఉన్నారని చెప్పింది.

విడుదల చేశారని తెలియగానే..

జస్టిస్​ మసూమా(పేరు మార్చాం) అనే మహిళా న్యాయమూర్తి.. బ్రిటన్​కు చెందిన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను ఏ విధంగా అఫ్గాన్​ను వీడి వచ్చానో వివరించారు. అత్యాచారాలు, వేధింపులు, హత్యలు వంటి కేసుల్లో వందలాది మందికి శిక్ష విధించారు జస్టిస్​ మసూమా.

" జైళ్లలో ఉన్న నేరస్థులను తాలిబన్లు విడుదల చేశారనే వార్తలు అర్ధరాత్రి పూట మేం విన్నాం. ఆ వెంటనే మా ఇంటిని వదిలి పరారయ్యాం. ఎవరూ గుర్తుపట్టకుండా బుర్ఖా ధరించి, ఓ కారులో ప్రయాణించాను. అదృష్టవశాత్తు అన్ని తాలిబన్ల చెక్​పాయింట్ల వద్ద ఎవరూ నన్ను గుర్తించలేదు.

- జస్టిస్ మసూమా, మహిళా న్యాయమూర్తి

జస్టిస్​ మసూమా ఇంటిని వీడి వెళ్లాక.. ఆమె కోసం తాలిబన్లు(Afghanistan Taliban) వచ్చి, ఆరా తీశారని ఆమెకు తన ఇంటి చుట్టుపక్కలవారు తెలియజేశారు. ఇటీవలే ఆమె.. భార్యను హత్య చేసిన కేసులో ఓ వ్యక్తి 20 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. కేసు ముగిసిన తర్వాత.. ఆ వ్యక్తి తన వద్దకు వచ్చి 'నేను జైలు నుంచి బయటకు రాగానే నా భార్యకు ఏ గతి పట్టిందో నీకూ అదే గతి పట్టిస్తానని బెదిరించాడు' అని ఆమె తెలిపారు.

"అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటలను నేను సీరియస్​గా తీసుకోలేదు. కానీ, తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక.. అతను నాకు చాలాసార్లు ఫోన్ చేసి బెదిరించాడు. న్యాయస్థానానికి సంబంధించిన కార్యాలయాల నుంచి నా సమాచారాన్ని అంతా సేకరించాడు. 'నా ప్రతీకారం తీర్చుకునేందుకు నేను నిన్ను ఎక్కడున్నా కనిపెడతాను' అని అతడు నాతో అన్నాడు."

-మసూమా, మహిళా న్యాయమూర్తి

అయితే.. అంతకుముందు తాలిబన్లు(Afghanistan Taliban) తాము ప్రభుత్వంలో విధులు నిర్వర్తించిన అధికారులకు ఎలాంటి హాని కలిగించబోమని హామీ ఇచ్చారు. కానీ, అఫ్గాన్​లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details