అఫ్గానిస్థాన్‌లోని భారతీయులంతా వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వీరిని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేయాలని అఫ్గాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సూచించింది. అక్కడ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న భారత సంస్థలు కూడా తమ సిబ్బందిని తక్షణమే భారత్‌కు తీసుకురావాలని తెలిపింది.
భారతీయులంతా వెనక్కి రావాలి- కేంద్రం హెచ్చరిక!
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మారణహోమం సృష్టిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ పౌరులంతా వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాలని హెచ్చరించింది. అక్కడ ప్రాజెక్టులు నిర్వహించే సంస్థలు కూడా తమ సిబ్బందిని భారత్‌కు తీసుకురావాలని సూచించింది.
భారతీయులందరూ వెనక్కి రావాలని కేంద్రం హెచ్చరిక
అఫ్గాన్‌లో తాలిబన్లకు, సైన్యానికి భీకర యుద్ధం జరుగుతోంది. ఈ మారణహోమంలో భారీ సంఖ్యలో జనం మరణిస్తున్నారు. దీంతో అప్రమత్తమై భారత ప్రభుత్వం తమ ప్రజలు స్వదేశానికి తిరిగిరావాలని హెచ్చరించింది.