తెలంగాణ

telangana

ETV Bharat / international

రూ.50లక్షల కోట్లు దాటిన పాకిస్థాన్​ అప్పులు - పాక్​ అప్పులు

ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పాకిస్థాన్​ అప్పులు రూ.50 లక్ష కోట్లు దాటినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ మొత్తంలో రూ.20 లక్షల కోట్లు ఇమ్రాన్ ఖాన్​ హయాంలోనే పెరిగినట్లు వెల్లడించింది.

pakistan
రూ.50 లక్షల కోట్లు దాటిన పాకిస్థాన్​ అప్పులు

By

Published : Nov 26, 2021, 6:44 AM IST

ఆర్థిక వ్యవస్థ నడిపించేందుకు విదేశాల మీద ఆధారపడుతున్న పాకిస్థాన్​ అప్పుల (Pakistan Debt) ఊబిలోకి కూరుకుపోతోంది. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ పాకిస్థాన్​ బుధవారం విడుదల చేసిన వివరాలు.. పాక్​ బాకీలను స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పాక్ అప్పులు రూ. 50 లక్షల కోట్లు (Pakistan Debt) దాటినట్లు ఎస్​బీపీ తన నివేదికలో పేర్కొంది.

ఇమ్రాన్​ ఖాన్​ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితి (Pakistan Debt) మరింత దిగజారినట్లు తెలుస్తోంది. బాకీ ఉన్న రూ.50.5 లక్షల కోట్లలో రూ.20 లక్షల కోట్లు ఇమ్రాన్ ఖాన్​ హయాంలోనే పెరిగినట్లు ఎస్​బీపీ తెలిపింది. గడిచిన 39నెలల్లో 70శాతం అప్పులు పెరిగాయని స్థానిక మీడియా పేర్కొంది. 2018 జూలై నుంచి 2021 జూన్ మధ్య రూ.14.9 లక్షల కోట్ల రుణాన్ని పాక్​ ప్రభుత్వం పొందినట్లు సమాచారం.

ఇదీ చూడండి :Pfizer Vaccine: ఐరోపాలో చిన్నపిల్లలకు ఫైజర్​ వ్యాక్సిన్​

ABOUT THE AUTHOR

...view details