తెలంగాణ

telangana

ETV Bharat / international

"పాక్​ గడ్డపై ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు"

పాకిస్థాన్​ కేంద్రంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న సంస్థల్ని ఉపేక్షించబోమని ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ఖాన్ స్పష్టం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటి సారి బహిరంగ సభలో ప్రసంగించారు.

ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమన్న ఇమ్రాన్

By

Published : Mar 9, 2019, 8:18 PM IST

ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటి సారి బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మత ప్రాతిపదికన దేశంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు ఇమ్రాన్. జాతిపిత మహ్మద్​ అలీ జిన్నా​ సిద్ధాంతాలను అనుసరిస్తూ పరమత సహనాన్ని పాటిస్తామన్నారు.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిళ్ల మేరకు ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్ నేతృత్వంలోని 'జమాత్​ ఉద్​ దవా' సంస్థ లాహోర్​ కార్యాలయాన్ని, ఆ సంస్థ ఛారిటీ విభాగం 'ఫలాహ్​ ఏ ఇన్సానియత్'​ను పాక్ ప్రభుత్వం మూసివేసింది. 120 మంది అనుమానిత ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుంది.

ఆర్థిక సహాయం ఎక్కడినుంచి?

ఇటీవల నిషేధం విధించిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్​ను అత్యంత ప్రమాదకర సంస్థల జాబితాలో పెట్టింది పాక్. 'ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ కార్యదళం' (ఎఫ్​ఏటీఎఫ్​) ప్రస్తావించిన ఉగ్రసంస్థల లావాదేవీలను పునఃపరిశీలించనుంది పాక్​ ప్రభుత్వం. ఫ్రాన్స్ వేదికగా కార్యకలాపాలు నిర్వహించే ఈ సంస్థ ఇప్పటికే పలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను ప్రమాదకర జాబితాలో చేర్చింది. వీటి కార్యకలాపాలను ఎప్పటికప్పడు అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోంది ఈ సంస్థ.

ABOUT THE AUTHOR

...view details