తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్​పై సౌదీ యువరాజుతో ఇమ్రాన్ చర్చలు - మహ్మద్​ బిన్ సల్మాన్

అధికరణ 370 రద్దు తర్వాత కశ్మీర్​లో పరిస్థితిపై సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తో పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ చర్చించారు. కశ్మీర్​పై భారత్​ నిర్ణయం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశముందని తెలిపినట్లు సమాచారం.

కశ్మీర్

By

Published : Aug 7, 2019, 7:54 PM IST

కశ్మీర్​ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయంపై పాకిస్థాన్​ విషం కక్కుతూనే ఉంది. అంతర్జాతీయంగా ఈ విషయాన్ని పెద్దది చేసేందుకు కపట నాటకాలు ఆడుతోంది. తాజాగా కశ్మీర్​లో పరిస్థితిపై సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తో పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ ఫోన్​లో సంభాషించారు.

ఈ విషయాన్ని ఆ రెండు దేశాల మీడియా స్పష్టం చేసింది. సంభాషణలో భాగంగా కశ్మీర్​పై భారత్​ నిర్ణయంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఇమ్రాన్​ చెప్పినట్లు సమాచారం.

ఇదీ చూడండి: షోపియాన్​ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్

ABOUT THE AUTHOR

...view details