నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడిని కాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించిన వారికే ఆ పురస్కారం అందించడం సముచితమన్నారు. ఇమ్రాన్‌కు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వాలని పాక్ పార్లమెంట్ మార్చి 2న తీర్మానించింది. భారత పైలట్ అభినందన్‌ను వెనక్కి పంపి ఇమ్రాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించారని అభిప్రాయపడింది. నోబెల్ శాంతి పురస్కారానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అర్హుడని పేర్కొంది.
'నాకా అర్హత లేదు' - ఇమ్రాన్ ఖాన్
కశ్మీర్ సమస్యను పరిష్కరించిన వారే నిజమైన శాంతి దూతలని.. ఈ సమస్యను పరిష్కరించిన వారికే నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
నోబెల్ శాంతి ఇవ్వాలన్న డిమాండ్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
"నేను నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడిని కాదు. కశ్మీర్ సమస్యను తీర్చిన వారికే నోబెల్ శాంతి పురస్కారాన్ని అందించాలి. కశ్మీరీల మనోభావాలకు అనుగుణంగా శాంతిని, అభివృద్ధిని పెంపొందించిన వారికి అందించాలి." ఇమ్రాన్‌ఖాన్, పాక్ ప్రధానమంత్రి, ట్విట్టర్
ఇమ్రాన్‌ఖాన్ ట్వీట్‌ను హిందీలో ట్వీట్ చేసింది ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ -ఇ-ఇన్సాఫ్.
Last Updated : Mar 4, 2019, 6:15 PM IST