ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పాకిస్థాన్, చైనా మరోసారి పేర్కొన్నాయి. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (రెండో దశ) ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాయి. తాజాగా ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు సహకారంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఫోన్‌లో సమీక్ష జరినట్లు ఇరు దేశాల అధికారిక కార్యాలయాలు వెల్లడించాయి.
చైనాపై ఇమ్రాన్ ప్రశంసలు..
కరోనా వైరస్ మహమ్మారిని చైనా ఎదుర్కొన్న తీరును ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సంభాషణ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. పాకిస్థాన్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్ అందించడంలో చైనా సహకారాన్ని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి చూపుతున్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో ఇరు దేశాలు ఆర్థిక, వాణిజ్య అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (China Pakistan Economic Corridor - CPEC)నుఅత్యంత నాణ్యతతో నిర్మించడంపై ఇమ్రాన్ ప్రశంసలు కురిపించినట్టు పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఆదుకోండి..
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు(Afghanistan Taliban) అధికారం చేపట్టినప్పటి నుంచి వారికి మద్దతుగా గళం వినిపిస్తున్న చైనా, పాకిస్థాన్(Pakistan Taliban Relations) మరో అడుగు ముందుకేశాయి. అఫ్గానిస్థాన్‌కు(Afghan News) తక్షణమే మానవతా సాయం, ఆర్థిక సహకారం అందించాల్సిందిగా.. అంతర్జాతీయ సమాజాన్ని తొలిసారి ఉమ్మడిగా అభ్యర్థించాయి. శీతాకాలం కారణంగా అఫ్గానిస్థాన్ ప్రజలు నిత్యావసరాల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి.
"అఫ్గాన్‌లోని పరిస్థితులపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. ఫోన్‌లో చర్చించారు. అఫ్గాన్ ప్రజల కష్టాలను తొలగించేందుకు, ఆ దేశ పునర్నిర్మాణం కోసం మానవతా సాయం, ఆర్థిక సహకారం అందించాల్సిందిగా... అంతర్జాతీయ సమాజానికి వారు విజ్ఞప్తి చేశారు."