తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆమెతో ప్రధాని రాసలీలల్లో నిజమెంత? - రెహ్మాన్​ మాలిక్​

అమెరికన్​ అడ్వెంచరిస్ట్​ సింథియా రిచ్చీతో పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ శృంగారాన్ని కోరుకున్నారని ఆ దేశ ప్రముఖ టీవీ హోస్ట్​ అలీ సలీమ్​ వెల్లడించారు. ఈ విషయాన్ని సింథియానే స్వయంగా తనతో చెప్పినట్టు స్పష్టం చేశారు. సలీమ్​ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరతీశాయి.

'Imran Khan wanted to intimate with Cynthia Ritchie'
ఆమెతో ప్రధాని రాసలీలల్లో నిజమెంత!

By

Published : Jun 7, 2020, 4:07 PM IST

పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ రాజకీయ జీవితాన్ని ముప్పులో పడేసే వార్తలు భగ్గుమన్నాయి. అమెరికన్​ అడ్వెంచరిస్ట్​ సింథియా డాన్​ రిచ్చీని తనతో శృంగారం చేయమని అప్పట్లో ఇమ్రాన్​ అడిగినట్టు ప్రముఖ టీవీ హోస్ట్​​ అలీ సలీమ్​ వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

తాను, సింథియా ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవాళ్లమని సలీమ్​ పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్లని తెలిపారు. ఆ సమయంలోనే.. ఇమ్రాన్​ అడిగిన విషయాన్ని సింథియా తనతో పంచుకున్నట్టు వెల్లడించారు సలీమ్​.

వివాదాల సింథియా...

అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి రెహ్మాన్​ మాలిక్​.. 2011లో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు సంచలన ఆరోపణలు చేశారు సింథియా. గత శుక్రవారం జరిగిన ఓ ఫేస్​బుక్​ లైవ్​ సెషన్​లో ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ ప్రధాని యూసఫ్​ రాజా గిలాని, మాజీ ఆరోగ్య మంత్రి మఖ్​దూమ్​ షాహబుద్దిన్​ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన సలీమ్​.. సింథియా తన ముందు ఈ విషయాలను ఎప్పుడూ ప్రస్తావించలేదన్నారు.

"ఇమ్రాన్​ ఖాన్​ గురించి మాట్లాడే అంత సన్నిహితంగా మేము ఉన్నప్పుడు... అత్యాచార ఘటనను కూడా సింథియా నాతో ప్రస్తావించేదే కదా. కానీ నాతో ఏం చెప్పలేదు."

-- అలీ సలీమ్​, పాకిస్థాన్​ టీవీ హోస్ట్​.

ABOUT THE AUTHOR

...view details