పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది పాక్ ప్రధాని కార్యాలయం.
అఫ్గాన్ చెరలో ఉన్న పాశ్చాత్య బందీలను ఆ దేశం విడుదల చేయడం సానుకూల పరిణామమని.. వారంతా ఇప్పుడు స్వేచ్ఛగా ఉండొచ్చని ట్రంప్‌తో చెప్పారు ఖాన్.
ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ఇమ్రాన్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపినట్లు పాక్ పేర్కొంది. అఫ్గాన్‌లో శాంతి స్థాపన, స్థిరత్వం కోసం ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని చర్చించినట్లు స్పష్టం చేసింది.