తెలంగాణ

telangana

ETV Bharat / international

దాడి జరిగిన 2 రోజులకు ఇమ్రాన్​ ఖాన్ స్పందన!​ - దాడి జరిగిన 2 రోజులకు ఇమ్రాన్​ ఖాన్ స్పందన!​

పాకిస్థాన్​లోని నన్​కానా సాహిబ్ గురుద్వారా​పై జరిగిన దాడిని... ఇమ్రాన్​ ఖాన్​ ఖండించారు. ఈ దాడి తన విధానానికి పూర్తిగా విరుద్ధమని... పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

pak-imran
పాక్​లోని గురుద్వారా దాడిని ఖండించిన ఇమ్రాన్​

By

Published : Jan 5, 2020, 5:15 PM IST

Updated : Jan 5, 2020, 5:39 PM IST

పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం నన్‌కానా సాహిబ్‌ గురుద్వారా వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకర చర్యల్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ 2 రోజుల తర్వాత​ ఖండించారు. ఈ దాడి తన సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకమన్నారు. దాడికి పాల్పడినవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

"ఈ గురుద్వారా దాడి నా సిద్ధాంతానికి వ్యతిరేకం. ఈ దాడిని ఏమాత్రం సహించేదిలేదు. న్యాయస్థానం, పోలీసులు నుంచి సిక్కులకు రక్షణ ఉంటుంది."

-ఇమ్రాన్​ ఖాన్​, పాక్​ ప్రధాని ​

మరోసారి విషం...

భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు ఇమ్రాన్​ ఖాన్​. భారత ప్రభుత్వం మద్దతులో పోలీసులు ముస్లింలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భారత్​లో ముస్లింలు, ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులకు పాక్​లో జరిగిన గురుద్వారా దాడికి మధ్య చాలా తేడా ఉందని చెప్పుకొచ్చారు.

దాడి జరిగిన 2 రోజులకు ఇమ్రాన్​ ఖాన్ స్పందన!​

ఇదీ చూడండి : పాక్‌లో గురుద్వారాపై దాడి..ఖండించిన భారత్‌..!

ఇదీ చూడండి : గురుద్వారాపై దాడిని ఖండించిన ఎస్​జీపీసీ.. కమిటీ ఏర్పాటు

Last Updated : Jan 5, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details