తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్ యుద్ధవాతావరణం సృష్టిస్తోంది: ఇమ్రాన్​

కశ్మీర్ సమస్య నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు పుల్వామా దాడి అనంతరం నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని భారత్ మళ్లీ సృష్టిస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. భారత్ నుంచి నిజంగానే ముప్పు ఉందన్న ఇమ్రాన్.. ఈ పరిస్థితులకు దీటుగా స్పందించాల్సిన అవసరముందంటూ స్థానిక మీడియాతో మాట్లాడారు. భారత అంతర్గత వ్యవహారాల్లో పాక్ జోక్యం చేసుకోరాదని ఇమ్రాన్​ వ్యాఖ్యలకు బదులిచ్చారు మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్​.

భారత్ యుద్ధవాతావరణం సృష్టిస్తోందని ఇమ్రాన్ ఆరోపణ

By

Published : Aug 10, 2019, 9:18 AM IST

భారత్​పై పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పుల్వామా దాడి అనంతరం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో.. అదే తరహాలో యుద్ధ వాతావరణాన్ని ఇప్పుడు సృష్టించాలని భారత్​ చూస్తోందన్నారు. కశ్మీర్ సమస్య నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకే భారత్​ ఇలా చేస్తోందని అభిప్రాయపడ్డారు ఇమ్రాన్​. ఈ పరిస్థితులకు దీటుగా స్పందించాల్సిన అవసరముందంటూ పాక్​ మీడియాతో మాట్లాడారు. మరోవైపు కశ్మీర్​ విషయంలో మోదీ సర్కారు చర్యలకు ప్రతిగా పాకిస్థాన్​ తీసుకున్న నిర్ణయాలకు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది.

ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్​ స్పందించారు. భారత అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు.

తాలిబన్​ల 'శాంతి' సూచన

కశ్మీర్ సమస్యను అఫ్గానిస్థాన్​తో ముడిపెట్టొద్దని తాలిబన్​ సంస్థ సూచించింది. జమ్ముకశ్మీర్​లో హింసకు తావులేకుండా భారత్​-పాక్ సంయమనం పాటించాలని ఆ సంస్థ ప్రతినిధి జబీలుల్లా ముజాహిద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

చైనా స్పందన

భారత్​, పాక్​లు తమకు స్నేహపూర్వక మిత్రదేశాలని... కశ్మీర్ విషయంలో ఐరాస భద్రతా మండలి తీర్మానాలు, సిమ్లా ఒప్పందాన్ని అనుసరించి రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

కశ్మీర్​ విషయమై మద్దుతు కోరేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషీ చైనా వెళ్లారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్​యూ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఉభయ దేశాలు సమస్యను పరిష్కారించుకోవాలని ఖురేషికి సూచించారు వాంగ్​యూ.

ABOUT THE AUTHOR

...view details