కొవిడ్-19 ప్రభావంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు బలహీనమై, సాధారణ వైద్యసేవలకు అంతరాయాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితులు శిశువుల మరణాలు పెరిగేందుకు దారితీస్తున్నాయని యునిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ అంశంపై లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ పరిశోధకుల అధ్యయనాన్ని ప్రస్తావించింది. తక్కువ, మధ్య ఆదాయం గల 118 దేశాల్లో రోజుకు అదనంగా 6 వేల మంది ఐదేళ్లలోపు పిల్లలు చనిపోయే ప్రమాదముందని అధ్యయనం పేర్కొంది.