భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ బృందం, తేజస్ యుద్ధ విమానాలు దుబాయ్ ఎయిర్ షో-2021లో అద్భుత విన్యాసాలతో అబ్బురపరిచాయి. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందం.. తొమ్మిది హాక్ 132 యుద్ధ విమానాలతో.. దుబాయ్ యుద్ధవిమానాలు ఏర్మచ్చీ ఎంబీ-339తో కలిసి ప్రయాణించింది. బుర్జ్ ఖలీఫా, పాల్మ్ జుమేరా, బుర్జ్ అల్ అరబ్ వంటి ప్రిసిద్ధ ప్రాంతాలపై ఈ ప్లైపాస్ట్ నిర్వహించారు. ఈ మేరకు ఐఏఎఫ్ ప్రకటన విడుదల చేసింది. సూర్యకిరణ్ బృందం విన్యాసాలు స్థానికులను విశేషంగా అలరించినట్లు పేర్కొంది.
తేజస్ యుద్ధవిమానాలు కూడా ఎప్పటిలాగే ఈ ఎయిర్‌షోలో హైలైట్‌గా నిలిచాయి. మెరుపువేగం, విభిన్న ప్రత్యేకలతో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.