అక్రమ సంబంధాలు దాంపత్య జీవితాల్లో చిచ్చు పెడతాయి. ఒక్కోసారి.. మూడోవ్యక్తి ప్రవేశంతో పరువు హత్యలకు దారితీస్తాయి. ఇలాంటి సంఘటనే పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి చెవులు, ముక్కు కోశాడు ఓ భర్త. లాహోర్‌కు 375 కిలోమీటర్ల దూరంలోని ముజఫర్‌గఢ్ గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..
అక్రమ్ అనే వ్యక్తి ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఖయూమ్ ఆగ్రహంతో రగిలిపోయాడు. గురువారం తన ఇంటికి వెళ్తున్న అక్రమ్‌ను ఖయూమ్, అతని స్నేహితులు అడ్డుకున్నారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పదునైన కత్తితో.. ముక్కు, చెవులు కోసేశారు. తీవ్ర రక్తస్రావమైన అక్రమ్‌ను అక్కడే వదిలేసి వెళ్లారు.