తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​ ఎయిర్​పోర్ట్​ కాల్పుల్లో 40 మంది మృతి - కాబుల్​ ఎయిర్​పోర్ట్​

అఫ్గాన్​లోని కాబుల్​ విమానాశ్రయంంలో సోమవారం జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్​ కమాండర్​ వెల్లడించారు. విదేశాలకు వెళ్లిపోవటంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని పిలుపునిచ్చారు. మరోవైపు.. సోమవారం కాబుల్​ నుంచి కతార్​ వెళ్లిన అమెరికా వాయుసేన విమానం చక్రాలపై ఓ వ్యక్తి మృతదేహం లభించింది.

ేUS Air Force
అమెరికా వాయుసేన విమానం సీ-17

By

Published : Aug 18, 2021, 2:28 PM IST

అఫ్గాన్​ నుంచి వెళ్లిపోవాలనే ప్రయత్నంలో కాబుల్​ విమానాశ్రయానికి భారీగా తరలివస్తున్నారు అక్కడి ప్రజలు. ఈ క్రమంలో గత సోమవారం విమానాశ్రయంలో విదేశీ బలగాలు చేసిన కాల్పులు, తొక్కిసలాటలో మొత్తం 40 మంది మృతి చెందినట్లు తాలిబన్​ కమాండర్​ తెలిపారు. విదేశాలకు వెళ్లటంపై వదంతులు నమ్మొద్దని, విమానాశ్రయానికి రావొద్దని పిలుపునిచ్చారు. అఫ్గానిస్థాన్​లో శాంతిస్థాపనకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నామని తాలిబన్లు ప్రకటించారు.

వాయుసేన సీ-17 విమానంలో అఫ్గాన్​ పౌరులు

" విదేశీ విమానాలకు వేలాడొద్దు. సోమవారం విమానాశ్రయంలో జరిగిన కాల్పుల్లో 30-40 మంది మరణించారు. ఎవరి ఇంటిలో వారు ఉండాలి. ఎవరికీ హాని లేదు."

- మొహిబుల్లా హెక్మత్​, తాలిబన్​ కమాండర్​.

అమెరికా సహా ఇతర దేశాలు తమ పౌరులను తిరిగి తీసుకెళ్లేందుకు విమానాలు పంపిస్తున్నాయి. మంగళవారం సైతం కాబుల్​ విమానాశ్రయానికి అఫ్గాన్​ పౌరులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ప్రజలు ఎవరూ రావొద్దని తాలిబన్లు ప్రకటన చేశారు.

వాయుసేన సీ-17 విమానంలో అఫ్గాన్​ పౌరులు

విమాన చక్రాలపై మృతదేహం

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​ నుంచి గత ఆదివారం కతార్​ వెళ్లిన అమెరికా వాయుసేన విమానం సీ-17 గ్లోబ్​మాస్టర్​ చక్రాలపై ఓ వ్యక్తి మృతదేహం లభించినట్లు అగ్రరాజ్య ఎయిర్​ఫోర్స్​ తెలిపింది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. అయితే.. ఎంత మంది చనిపోయారనే విషయం తెలియదని పేర్కొంది. 'అమెరికా వాయుసేన సీ-17 గ్లోబ్​మాస్టర్​-3 బలగాల ఉపసంహరణకు కావాల్సిన వస్తువులతో గత ఆదివారం కాబుల్​లోని హమిద్​ కర్జాయ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అందులోని వస్తువులను దింపేలోపే.. వందల మంది విమానాన్ని చుట్టుముట్టారు. పరిస్థితులు గందరగోళంగా మారిన క్రమంలో వీలైనంత త్వరగా విమానాన్ని సిబ్బంది టేకాఫ్​ చేశారు.' అని పేర్కొంది.

దేశం నుంచి ఎలాగైనా వెళ్లిపోవాలని కాబుల్​ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. రెక్కల కింద వేళాడుతూ టేకాఫ్​ అయిన తర్వాత ముగ్గురు కిందపడినట్లు ఓ వీడియో వైరల్​గా మారిన తర్వాత.. ఈ మృతదేహం దొరకటం ప్రాధాన్యం సంతరించుకుంది.

టేకాఫ్​ సమయంలో కిందపడుతున్న దృశ్యం

ఇదీ చూడండి:జనరల్‌ బోగీ కాదు.. అమెరికా విమానం ఇది!

ABOUT THE AUTHOR

...view details