బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శిబిరాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది, రోహింగ్యా శరణార్థులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఈ ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నప్పటికీ.. మరణాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితిలోని శరణార్థుల హైకమిషన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
రోహింగ్యా శిబిరాల్లో భారీ అగ్ని ప్రమాదం - బంగ్లాదేశ్లో భారీ అగ్ని ప్రమాదం
బంగ్లాదేశ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోహింగ్యాలు నివాసముండే శిబిరాల్లో ఈ ఘటన జరగ్గా.. భారీ ఆస్తినష్టం వాటిల్లింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెప్తున్నా.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
బంగ్లాదేశ్ రోహింగ్యా శిబిరాల్లో భారీ అగ్ని ప్రమాదం
మయన్మార్ నుంచి వలస వచ్చిన లక్షలాది మంది రోహింగ్యాలు.. దక్షిణ బంగ్లాదేశ్‌లోని కోక్స్ బజార్ పట్టణంలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో నివాసం ఉంటున్నారు. అక్కడే అగ్ని ప్రమాదం జరిగింది.