తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియాలో 'సెరోజా' బీభత్సం- వందల ఇళ్లు ధ్వంసం

ఆస్ట్రేలియాలో సెరోజా తుపాను విధ్వంసం సృష్టించింది. గంటకు సుమారు 170 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయగా.. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి, వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్​ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Australia was devastated by Hurricane Seroja
ఆస్ట్రేలియాను వణికించిన సెరోజా- నేలకూలిన ఇళ్లు

By

Published : Apr 12, 2021, 11:53 AM IST

ఆస్ట్రేలియాను వణికించిన 'సెరోజా'- నేలకూలిన ఇళ్లు

ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలోని పలు పట్టణాల్లో.. 'సెరోజా' తుపాను బీభత్సం సృష్టించింది. మూడో కేటగిరికీ చెందిన ఈ తుపాను.. పెర్త్‌కు 580 కిలోమీటర్ల దూరంలోని కాలబర్రీ పట్టణం వద్ద తీరం దాటింది. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయి. దీని ప్రభావంతో భారీ వృక్షాలు నేలకూలాయి, వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలడం వల్ల.. పరిసర ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

అయితే.. ఈ తుపాను విధ్వంసంలో ఎవరూ గాయపడినట్లు సమాచారంలేదని.. అక్కడి అధికారులు తెలిపారు.

ప్రస్తుతం.. సెరోజా తుపాను బలహీనపడినట్లు ఆస్ట్రేలియా వాతావరణ విభాగం పేర్కొంది. ఈ తుపాను ఆస్ట్రేలియాను చేరకముందు ఇండోనేషియా, తిమోర్‌ లెస్టోలను అతలాకుతలం చేసింది. ఆ రెండు దేశాల్లో సెరోజా ధాటికి 174 మంది మరణించగా.. 48 మంది గల్లంతయ్యారు.

ఇదీ చదవండి:మాస్కు ధరిస్తే 14వేల మంది ప్రాణాలు సేఫ్​!

ABOUT THE AUTHOR

...view details