ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడుతున్న వారిలో వృద్ధులే అధికం. మృతుల్లోనూ వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కోరల నుంచి వృద్ధులను కాపాడటానికి వ్యాక్సిన్ ఎంతో అవసరం. కానీ, వ్యక్తి వయస్సు ఆధారంగానే టీకా నుంచి కచ్చితమైన ఫలితాలు రాబట్టగలమని నిపుణులు విశ్లేషించారు. ఇతర వయస్సుల వారితో పోలిస్తే వృద్ధులపై వ్యాక్సిన్ పనితీరు మెరుగ్గా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
వ్యాక్సిన్ ప్రధానంగా రోగనిరోధక శక్తిపై ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి బలహీనమైన రోగనిరోధక శక్తి గల వృద్ధుల్లో టీకా పనితీరు ఆశాజనకంగా ఉండకపోవచ్చని అంచనా వేశారు నిపుణులు. మరోవైపు ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ పిల్లల్లో వచ్చే అనారోగ్య సమస్యలకు ఉద్దేశించి వచ్చినవేనని వారు గుర్తుచేశారు. కాబట్టి వృద్ధుల్లో టీకా పనితీరు ఎలా ఉంటుంది? అనేదానికి వైద్యుల వద్ద కచ్చితమైన సమాచారంలేదని పరిశోధకులు అన్నారు.
టీకా పనితీరు అక్కడే నిర్ధరణ కావాలి..