తెలంగాణ

telangana

ETV Bharat / international

ISIS khorasan: 'ఐసిస్​-కే'కు రూ.వేల కోట్ల నిధులు ఎలా వచ్చాయ్​? - అఫ్గానిస్థాన్​ న్యూస్

అఫ్గాన్​ కాబుల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులు(Kabul Airport Blast) జరిపిన ఐసిస్-కే ఇంత శక్తిమంతంగా అవతరించడానికి ఆ సంస్థకు అందిన రూ.వేల కోట్ల నిధులే కారణమని నిపుణులు చెబుతున్నారు. విదేశీ విరాళాలు, సున్నపు గనులు సహా.. ఎన్జీఓ ముసుగులో ఐసిస్​-కేకు(ISIS khorasan) భారీగా డబ్బు వచ్చిందని పేర్కొన్నారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు, విదేశాల నుంచి ఈ సంస్థకు నిధులు ఎలా బదిలీ అయ్యాయి వంటి కీలక వివరాలు మీకోసం ప్రత్యేకంగా...

How NGOs, foreign donors, talc mines funded ISIS (K)
ఐసిస్​-కేకు రూ.వేల కోట్లు నిధులు ఎలా వచ్చాయ్​?

By

Published : Aug 29, 2021, 5:31 PM IST

2015లో అఫ్గానిస్థాన్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన ఇస్లామిక్ స్టేట్​ ఖోరసన్​(ISIS khorasan) అనతికాలంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రసంస్థగా అవతరించింది. ఐసిస్​కు అనుబంధ సంస్థ అయిన ఐసిస్​-కే.. గురువారం కాబుల్ విమానాశ్రయం వద్ద జంట ఆత్మాహుతి దాడులకు పాల్పడి(Kabul Airport Blast) ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఈ తీవ్రవాద సంస్థ ఇంత శక్తిమంతంగా బలపడటానికి దానికి అందిన రూ.వేల కోట్ల నిధులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎన్జీఓలు, విదేశీ విరాళాలు, సున్నపు గనుల ద్వారా ఐసిస్-కేకు భారీ ఆర్థిక సాయం అందినట్లు తెలిపారు.

ఐసిస్​-కేను స్థాపించిన తొలినాళ్లలో దీని మాతృ సంస్థ ఐసిస్​(ఇస్లామిక్ స్టేట్​ ఇన్ సిరియా అండ్ లెవాంట్-ISIS​ ) నుంచి నిధులు అందేవి. అయితే తమ ప్రాబల్యం తగ్గి నిధుల కొరత ఏర్పడిన తర్వాత.. స్వతహాగా నిధులు సమకూర్చుకోవాల్సిందేనని ఐసిస్.. ఐసీస్​-కేకు స్పష్టం చేసింది. అప్పటి నుంచి నిధుల వేట మొదలుపెట్టింది ఈ ఉగ్రసంస్థ.

తొలుత ఖైబర్ పాస్​ చట్టుపక్కల జరిగే స్మగ్లింగ్​పై నియంత్రణ కోసం పోరాడి సఫలీకృతమైంది ఐసిస్​-కే. కునార్ ప్రావిన్సులోని సున్నపు గనులు, కలపను ముఖ్య ఆర్థిక వనరులుగా మార్చుకుని నిధులు సమాకూర్చుకుంది.

ఏడాదిలోనే రూ.2వేల కోట్లు..

కాబుల్​లోని అఫ్గాన్​ వ్యూహాత్మక పరిశోధనల సంస్థ-AISS నివేదిక ఆధారంగా ఓ నిపుణుడి అంచనా ప్రకారం.. స్థాపించిన తొలి ఏడాదిలోనే ఐసిస్​-కేకు(ISIS khorasan) 271 మిలియన్ డాలర్లు(రూ.2వేల కోట్లు) నిధులు సమకూరాయి. ఇందులో ప్రైవేటు దాతల నుంచి అందినవి 120 మిలియన్ డాలర్లు. సిరియా, ఇరాక్​లోని ఐసిస్ నుంచి వచ్చినవి 78 మిలియన్ డాలర్లు. అరబ్ గల్ఫ్ దేశాల నుంచి దాదాపు 40 మిలియన్​ డాలర్ల నిధులు వచ్చాయి. జకాత్ రూపంలో 33 మిలియన్ డాలర్లు వచ్చాయి.

ఎన్జీఓ కీలక పాత్ర..

అయితే ఐసిస్​-కేకు నిధులు సమకూర్చే విషయంలో 'నెజాత్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్' అనే ఎన్జీఓ కీలక భూమిక పోషించింది. ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తోందని 2019 నవంబర్​ 18న దీనిపై అమెరికా అంక్షలు విధించింది. ఐసిస్​-కేకు కేవలం ఆర్థికపరంగానే కాకుండా అవసరమైన మెటీరియల్, సాంకేతిక సహకారం, వస్తువులు సమకూర్చుతూ అన్ని విధాలా నెజాత్ సాయం అందించింది.

నెజాత్​లో పనిచేసే వ్యక్తే ఐసిస్​-కే నియామకుడిగా వ్యవహరించేవాడు. ఐసిస్ కోసం కాబుల్​లోనే నియామకాలు జరిపేవాడు. కొత్తగా వచ్చే వారిని నంగర్​హార్ ప్రావిన్సు చేర్చేందుకు ఇతడే ప్రయాణ ఏర్పాట్లు చేసేవాడు. ఈ ఎన్జీఓ ముసుగులోనే కోట్ల రూపాయల నిధులు ఐసిస్​-కేకు బదిలీ అయ్యేవి. 2016 చివర్లో సలాఫీ సంఘీభావ సమావేశం పేరుతో నెజాత్ ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఐసిస్​-కే నాయకులు ప్రణాళికలు రూపొందించుకునేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెజాత్ కార్యనిర్వహక సభ్యులు సహా సలాఫీ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు నెజాత్​కు ఆర్థిక సాయం అందించేవారున్నారు.

బ్యాంకుల ద్వారా బదిలీ..

ఖతార్, యూఏఈ, ఇరాక్​, ఇతర పశ్చిమాసియా దేశాల నుంచి ఐసిస్​-కే(ISIS khorasan) తరఫున నెజాత్ విరాళాలు సేకరించేంది. అనంతరం వాటిని బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా గల్ఫ్​ నుంచి ఆసియాకు బదిలీ చేసేది. ఈ నగదును కాబుల్​, జలాలాబాద్​లోని నెజాత్ కార్యాలయం నుంచి ఐసిస్​-కే సమన్వయకర్త సేకరించేవాడు. అనంతరం వాటిని తమ కమాండర్లకు పంపిణీ చేసేవాడు.

నెజాత్ డైరెక్టర్..

నెజాత్​ను నిర్వహించే వారిలో కువైట్​కు చెందిన సయెద్​ అహ్మద్​ ఖాన్ కీలకంగా వ్యవహరించేవాడు. ఇతడే దీనికి డైరెక్టర్. నెజాత్ కార్యనిర్వహక సభ్యుడు రోహుల్లా కూడా ప్రధాన పాత్ర పోషించేవాడు. వీరితో పాటు ఐసిస్​కు సహకరించే ముఖ్య వ్యక్తుల్లో మాల్దీవులకు చెందిన మొహమద్ అమీన్​ ఒకరు. డిజిటల్ మీడియా ఆపరేషన్స్ బాధ్యతను ఐసిస్ ఇతడికే అప్పగించింది. మాల్దీవుల నుంచి ఐసిస్​ కోసం నియామకాలు కూడా ఇతడే చేపట్టేవాడు.

2019 ఏప్రిల్ నాటికే అమీన్​ ఐసిస్​ కోసం వారానికి కనీసం 10 రిక్రూట్​మెంట్​ సెషన్లు నిర్వహించేవాడు. మొదట్లో సిరియా కోసం నియామకాలు చేపట్టిన ఇతడు.. ఆ తర్వాత అఫ్గాన్​​కు మాత్రమే ఫైటర్లను పంపేవాడు.

ఐసిస్​ కోసం నియమకాలు చేపట్టే వారిలో లష్కరే తోయిబా(Lashkar-e-Taiba) ఉగ్రవాది అబ్దుల్ పేఖ్ ఖొరసాని కూడా ముఖ్య పాత్ర పోషించాడు. 1998 వరకు కశ్మీర్​లో కార్యకలాపాలు నిర్వహించిన ఇతడు.. ఆ తర్వాత సిరియాకు మకాం మార్చాడు. అఫ్గాన్ కునార్​లో ఐసిస్ బ్యానర్ ఎత్తిన తొలి వ్యక్తి కూడా ఇతడే అని చెబుతుంటారు.

(రచయిత- సంజీవ్ కుమార్​ బారువా, సీనియర్ జర్నలిస్ట్)

ఇవీ చదవండి:Afghan Taliban: 'అవన్నీ తిరిగిచ్చేయండి'.. పౌరులకు తాలిబన్ల ఆర్డర్

Panjshir Valley: 'పంజ్​షేర్​లోకి తాలిబన్లా? ఒక్కరూ అడుగుపెట్టలేదు!'

Afghan crisis: అఫ్గాన్​ సంక్షోభంపై అమెరికా, చైనా సైనిక చర్చలు!

ABOUT THE AUTHOR

...view details