ఆసియా భవిష్యత్తును భారత్-చైనాల భాగస్వామ్యమే నిర్ణయిస్తుందని చెప్పారు నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యవాలి. వుహాన్ సమావేశం అనంతరం రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడిందని, కానీ గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.
'ఫారెన్ పాలసీ ఆఫ్ నేపాల్ ఇన్ చేంజింగ్ జియోపొలిటికల్ కాంటెక్స్ట్' వెబినార్లో ప్రసంగించారు ప్రదీప్. భారత్-చైనాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అది కఠినమైన సవాలు అని పేర్కొన్నారు.