కరోనా మహమ్మారికి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేదని పరిశోధకులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన వాతావరణంలో వైరస్ వ్యాప్తిలో పెద్దగా మార్పు లేదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, రాష్ట్రాల్లోని 144 భౌగోళిక ప్రాంతాల్లో పరిశోధనలు జరిపారు. ఈ అధ్యయనాన్ని కెనడా మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించారు.
పాఠశాలల మూసివేత, భౌతిక దూరం పాటించడం వంటి ఆంక్షల ద్వారా పలు దేశాలు వైరస్ వ్యాపిని నియంత్రించినట్లు అధ్యయనం పేర్కొంది. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా సహా అనేక దేశాల నుంచి వివరాలు సేకరించారు పరిశోధకులు. మార్చి 20నాటికి నమోదైన కేసులను.. మార్చి 27వరకు నమోదైన కేసుల సంఖ్యతో పోల్చి చూశారు.