ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో హాంకాంగ్ దద్దరిల్లుతోంది. హాంకాంగ్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో నిరసనకారులు- పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ యుద్ధాన్ని తలపించింది.
యుద్ధాన్ని తలపించేలా హాంకాంగ్ ఆందోళనలు యుద్ధాన్ని తలపించేలా..
5 నెలలుగా ప్రజాస్వామ్యవాదులు చేస్తున్న నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ప్రతిగా ఆందోళనకారులు రాళ్లు, చేతికందిన వస్తువులతో పోలీసులపై దాడికి దిగారు.
శిథిలాల తొలగింపు..
విశ్వవిద్యాలయంలోని మార్గాల్లో ఉన్న శిథిలాలను, చెత్తను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించగా నిరసనకారులు అడ్డుకున్నారు. అయితే కఠినంగా ప్రవర్తించిన పోలీసులు.. పరిస్థితులను తమ అదుపులోకి తీసుకున్నారు. తరువాత కార్యకర్తలు, ప్రజలు, చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు శిథిలాలను తొలగించారు.
పోరాటం ఆగదు...
మరోవైపు ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించేవరకు.. విశ్వవిద్యాలయంలో ఆందోళన కొనసాగుతుందని నిరసనకారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:కర్ణాటక: రెబల్ ఎమ్మెల్యేల చుట్టూ ఉపఎన్నికల పోరు