హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారస్థాయికి చేరాయి. చైనీస్ విశ్వవిద్యాలయం హాంకాంగ్ క్యాంపస్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు, పోలీసుల మధ్య సంధి కుదిర్చేందుకు విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు ప్రయత్నించినప్పటికీ ఆందోళనలు కొనసాగాయి. గత ఐదు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో ఇవే అత్యంత హింసాత్మకమని అధికారులు తెలిపారు.
సంధి విఫలం.. ఆందోళనలు ఉద్ధృతం
హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా నిరసనకారులు, పోలీసుల మధ్య సంధి కుదిర్చేందుకు చైనీస్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరిపిన చర్చలు ఫలించకపోగా.. ఆందోళనలు చెలరేగాయి.
నిరసనకారులు, పోలీసుల మధ్య సంధి ప్రయత్నం విఫలం
ఇటీవల నిరసనల్లో ఓ వ్యక్తి సజీవ దహనం కావడం సహా పోలీసులు కాల్పుల్లో ఓ విద్యార్థి చనిపోయినప్పటి నుంచి విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రధాన భూభాగంలో పరిస్థితులు చేజారి పోయేలా ఉన్నాయని పోలీసులు హెచ్చరించారు. అప్పటినుంచి స్థానికంగా ఉన్న మెట్రో స్టేషన్లను మూసివేశారు. రైలు, బస్ సేవలను కూడా నిలిపివేశారు
ఇదీ చూడండి:బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 'రహస్య ప్రేమ'పై దుమారం!
Last Updated : Nov 13, 2019, 5:04 PM IST