హాంకాంగ్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు చైనాతో పాటు హాంకాంగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తూ.. రహదారులను నిర్భంధించారు. కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య భవనాలకు నిప్పు అంటించారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. ఫలితంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
హాంకాంగ్ నిరసనలు హింసాత్మకం.. 24 మందికి గాయాలు - హాంకాంగ్ నిరసనలు హింసాత్మకం.. 24 మందికి గాయాలు
హాంకాంగ్‌లో మరోమారు నిరసనలు హోరెత్తాయి. ఫలితంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 24 మంది గాయపడగా.. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
హాంకాంగ్ నిరసనలు హింసాత్మకం.. 24 మందికి గాయాలు
చైనా ప్రోద్బలంతో స్థానిక ప్రభుత్వం అత్యవసర అధికారాలు ఉపయోగించి నిరసనకారులు మాస్క్‌లు ధరించడంపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజాస్వామ్యవాదులు పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆందోళనలను తీవ్రం చేశారు.
ఇదీ చూడండి:నేడు భారత్-అమెరికా ప్రతినిధుల ఉన్నతస్థాయి సమావేశం
Last Updated : Oct 21, 2019, 7:59 AM IST