హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఆందోళనకారులు శాంతించడం లేదు. ఆదివారం షా టిన్ నగరంలో వందల మంది రోడ్లమీదకు వచ్చి ఆందోళనకు దిగారు.
బారికేడ్లను రోడ్లకు అడ్డంగా పెట్టి రవాణా వ్యవస్థను స్తంభింపజేశారు. చెత్తను దారికి అడ్డంగా పేర్చి నిప్పంటించారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు.