తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంగ్​కాంగ్:​ విదేశీయులకు కష్టాలు చెప్పుకున్న ప్రజలు - హాంగ్​కాంగ్

హాంగ్​కాంగ్​ పరిస్థితులపై విదేశీ పర్యటకులకు అవగాహన కల్పించేందుకు దేశంలోని ప్రధాన విమానాశ్రయంలో వందల మంది ప్రజలు నిరసనలు చేపట్టారు.  తమ కష్టాలను ప్రపంచానికి తెలియజేయటమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

హాంగ్​కాంగ్:​ విమానాశ్రయంలో వినూత్న నిరసన

By

Published : Jul 27, 2019, 6:27 AM IST

Updated : Jul 27, 2019, 8:20 AM IST

హాంగ్​కాంగ్:​ విమానాశ్రయంలో వినూత్న నిరసన
చైనా పాలనా విధానాలకు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​ ప్రజల నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. హాంగ్​కాంగ్​లోని తాజా పరిస్థితులను విదేశీయులకు తెలిపేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు నిరసనకారులు. హాంగ్​కాంగ్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి వందల మంది చేరుకుని పర్యటకులకు దేశ పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

సాధారణంగా ప్రయాణికుల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేచి ఉండే గదిని శుక్రవారం నల్లరంగు దుస్తులు ధరించిన ఆందోళనకారులు ఆక్రమించారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాంగ్​కాంగ్​కు విముక్తి కల్పించాలని బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు, విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు చేపట్టారు.

" ఇటీవలి కాలంలో హాంగ్​కాంగ్​లో ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి తెలపటమే మా ప్రధాన లక్ష్యం. గతంలో ఉన్నట్టుగా హాంగ్​కాంగ్​ ఇప్పుడు ఎందుకు లేదు?"

- ఆండీ హో, నిరసనల ఆర్గనైజర్​.

హాంగ్​కాంగ్​ నిరసనల నేపథ్యం

నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​లో ఎన్నో రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. వారం రోజుల నిరసనల అనంతరం బిల్లును పక్కన పెట్టింది ప్రభుత్వం. కానీ ఆందోళనలు సద్దుమణగలేదు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణలు, చైనా బిల్లు రద్దు, సార్వత్రిక ఎన్నికలు, ప్రస్తుత రాజ్యాంగ రద్దు, పోలీసుల అరాచకాలపై విచారణ చేపట్టాలని నెల రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నిరసనలు హింసాత్మకంగా మారి పలువురు గాయపడ్డారు.

ఇదీ చూడండి:విహారి: ఇది రష్యా శైలి సంక్రాంతి గురూ!

Last Updated : Jul 27, 2019, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details