తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంకాంగ్​: పోలీసులు- నిరసనకారుల మధ్య ఘర్షణ - జల ఫిరంగులు

హాంకాంగ్​లో ప్రజాస్వామ్య సంస్కరణలకు పిలుపునిస్తూ రోడ్లపై ప్రదర్శనలు చేపట్టారు నిరసనకారులు. ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీ కారణంగా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

నిషేధాజ్ఞలను లెక్కచేయని హాంకాంగ్ నిరసనకారులు

By

Published : Sep 16, 2019, 7:20 AM IST

Updated : Sep 30, 2019, 6:56 PM IST

హాంకాంగ్​ నిరసనలు: పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ

హాంకాంగ్​లో నిరసనలు రోజురోజుకూ తారస్థాయికి చేరుతున్నాయి. పోలీసుల నిషేధాజ్ఞలను లెక్కచెయ్యకుండా ప్రజాస్వామ్య ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేపట్టారు. కొంతమంది యూఎస్​, బ్రిటిష్ జెండాలు పట్టుకుని ప్రజాస్వామ్య సంస్కరణలకు పిలుపునిస్తూ పోస్టర్లు ప్రదర్శించారు. భారీ ర్యాలీ కారణంగా ట్రాఫిక్​కు తీవ్ర​ అంతరాయం ఏర్పడింది. నగరంలోని చాలా దుకాణాలు మూతపడ్డాయి.

అడ్మీరాల్టీ స్టేషన్​ వద్ద నిరసనకారులు బారీకేడ్లతో లోపలికి వెళ్లే మార్గాన్ని మూసేశారు. సెక్యూరిటీ కెమెరాలను ధ్వంసం చేశారు. పౌర హక్కుల సంఘం ర్యాలీకీ పోలీసులు అనుమతి నిరాకరించినా....ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. వేలాది మంది గొడుగులు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు.

పలు చోట్ల చెలరేగిన ఘర్షణలు

హాంకాంగ్​కు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ ఆందోళనకారులు నినదించారు. హాంకాంగ్ ప్రభుత్వ కార్యాలయ సముదాయం వద్దకు చేరుకుని బారికేడ్లపై ఇటుకలు, పెట్రోల్​ బాంబులను విసిరారు. ప్రతిగా పోలీసులు బాష్పవాయువు​ ప్రయోగించారు. జలఫిరంగులతో నిరసనకారులను చెదరగొట్టారు.

చైనాతో సంబంధం మాకొద్దు

ఈ ఏడాది జూన్‌లో చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లును వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు ఇప్పటికీ ఆగడంలేదు. ఆ బిల్లును ఉపసంహరిస్తామని హాంకాంగ్ పాలకులు ప్రకటించినప్పటికీ నిరసనలు సద్దుమణగలేదు. చైనాతో సంబంధం లేకుండా నేరుగా ఎన్నికలు జరపాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

Last Updated : Sep 30, 2019, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details