తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంకాంగ్​లో ఫ్లాష్​మోబ్​తో నిరసనలు..! - ఫ్లాష్​మోబ్

చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్​లో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆందోళనకారులు పలు ప్రాంతాల్లో ఫ్లాష్​మోబ్​లు నిర్వహించారు. ఫలితంగా పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు అధికారులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేశారు.

హాంకాంగ్​లో ఫ్లాష్​మోబ్​తో నిరసనలు..!

By

Published : Oct 13, 2019, 5:44 PM IST

హాంకాంగ్​లో ఫ్లాష్​మోబ్​తో నిరసనలు..!
నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని చైనాకు అప్పగించే చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్​లో గత 4 నెలలుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రోడ్లపై నిరసనబాట పట్టిన ఆందోళనకారులు.. తాజాగా హాంకాంగ్​ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫ్లాష్​మోబ్​లు నిర్వహించారు. కొంతమంది రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు తిరగకుండా నిర్భంధించారు. చైనా మద్దతుదారులకు వ్యతిరేకంగా గోడలపై నినాదాలు రాశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

18 జిల్లాలో ప్రజాస్వామ్య ఉద్యమకారులంతా ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా ముసుగులు ధరించి, గొడుగులు చేత పట్టుకొని స్థానిక షాపింగ్​మాల్స్​లో ఫ్లాష్​మోబ్​లు నిర్వహించారు. నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని చైనాకు అప్పగించటానికి వీలుగా చట్టం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలంటూ నినాదాలు చేశారు.

బ్రిటన్‌ 1997లో చైనాకు అప్పగించిన తరువాత హాంకాంగ్​లో​ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి పరిపాలన సాగుతోంది. అయితే ఇటీవలి చైనా దుందుడుకు నిర్ణయాలతో తమ హక్కులకు భంగం కలిగే అవకాశముందని దాదాపు నాలుగు నెలలుగా నిరసనబాట పట్టారు హాంకాంగ్ ప్రజలు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం నిరసనలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.

డిమాండ్లు ఇవే?

ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణలు, చైనా బిల్లు రద్దు, సార్వత్రిక ఎన్నికలు, ప్రస్తుత రాజ్యాంగ రద్దు, పోలీసుల అరాచకాలపై విచారణ చేపట్టాలని ఆందోళనలు చేస్తున్నారు హాంకాంగ్ ప్రజలు. కానీ బీజింగ్​ ప్రభుత్వం, క్యారీ ల్యామ్​ నిరసనకారుల డిమాండ్లను నెరవేర్చటంలో సుముఖత చూపటం లేదు.

ఇదీ చూడండి : కాలుష్యం కోరల్లో చిక్కుకున్న రాజధాని నగరం

ABOUT THE AUTHOR

...view details