తెలంగాణ

telangana

కొత్త చట్టంపై ఆందోళనలు.. వందల మంది అరెస్ట్​

ప్రజల హక్కులను హరించేలా ఉందంటూ చైనా ఆమోదించిన జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్​లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వందల మంది విద్యార్థులు, రాజకీయ నేతలను కొత్త చట్టం కింద అరెస్ట్ చేశారు పోలీసులు.

By

Published : Jul 1, 2020, 10:09 PM IST

Published : Jul 1, 2020, 10:09 PM IST

Hong Kong police arrest
హాంకాంగ్​లో కొత్త చట్టంపై ఆందోళనలు

చైనా ఆమోదించిన జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో నిరసనలు ప్రారంభం అయ్యాయి. హాంకాంగ్‌ స్వేచ్ఛను హరించే చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు వందల సంఖ్యలో బయటకు వచ్చి బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. నల్ల జెండా చేత పట్టుకొని స్వతంత్ర హాంకాంగ్‌ అంటూ నినదించారు.

హాంకాంగ్​లో ఆందోళనలు

అయితే.. కొత్త చట్టం ప్రకారం చైనా, హాంకాంగ్‌ ప్రభుత్వాలను వ్యతిరేకించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వందల మంది విద్యార్థులు, రాజకీయ నేతలు, ప్రజలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆందోళనకారులపై జల ఫిరంగులు ప్రయోగించారు.

ఇదీ చూడండి: రోనాతో దేశంలో ఒక్కరోజే 507 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details