హాంకాంగ్ చట్టసభ శుక్రవారం నిరసనలతో హోరెత్తింది. దేశంలో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు చైనా ప్రతిపాదించిన బిల్లుకు వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్య అనుకూల చట్టసభ్యులు ఆందోళనకు దిగారు. దేశంపై చైనా నియంతృత్వ చర్యలకు ఇది నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శాసనసభలో గందరగోళం సృష్టిస్తూ.. నిరసనలకు దిగిన ఇద్దరు చట్టసభ్యులను బలవంతంగా సభ నుంచి బయటకు లాక్కెళ్లారు భద్రతా సిబ్బంది.
బిల్లులో ఏముంది?
శుక్రవారం ప్రారంభమైనచైనా జాతీయ అసెంబ్లీ సమావేశంలో.. ఈ బిల్లును ప్రతిపాదించింది అక్కడి ప్రభుత్వం. ఈ తీర్మానాన్ని హాంకాంగ్ చట్టసభ ముందుకూ తీసుకొచ్చారు. గతేడాది నేరస్థుల అప్పగింత బిల్లును వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లో నిరసనలు వెల్లువెత్తినా.. మళ్లీ బీజింగ్ సంచలన నిర్ణయం తీసుకుంది.