తెలంగాణ

telangana

సర్కార్​ ఆదేశాలు బేఖాతరు... మాస్క్​లతో నిరసనలు

నల్లదుస్తులతో, ముఖానికి మాస్క్​లు ధరించి భారీ మానవహారం చేపట్టారు హాంగ్​కాంగ్​ వాసులు. ఇటీవల మాస్క్​ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ఆందోళనకారులు మళ్లీ నిరసనబాట పట్టారు.

By

Published : Oct 6, 2019, 12:32 PM IST

Published : Oct 6, 2019, 12:32 PM IST

Updated : Oct 6, 2019, 1:02 PM IST

హాం​కాంగ్​: ముఖానికి మాస్క్​లతో మానవహారం

ముఖానికి మాస్క్​లతో మానవహారం

హాంకాంగ్​లో మాస్క్​లపై నిషేధం విధించటం పట్ల ఆందోళనకారులు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, ముఖానికి మాస్క్​లతో ఓ భారీ మానవహారం నిర్వహించారు. ర్యాలీ నేపథ్యంలో ముందస్తు చర్యగా హాంకాంగ్​లోని సబ్​వే స్టేషన్లను అధికారులు మూసివేశారు.

కొద్దికాలంగా నిరసనకారులు వందల సంఖ్యలో సబ్​వే స్టేషన్లను, దుకాణాలను, రోడ్లను నిలిపివేయటం వల్ల హాం​కాంగ్​ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అత్యవసరంగా మాస్క్​ వాడకంపై నిషేధం విధించటాన్ని నిరసనకారులు తప్పుపట్టారు. 1967 చట్టం ప్రకారం అత్యవసర సమయాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని అధికారులు తెలిపారు. నిషేధ నిర్ణయాన్ని బీజింగ్​, ప్రభుత్వ మద్దతుదారులు స్వాగతించారు.

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది చట్టసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదని హితవు పలికారు. ఇలా చేస్తే నిరసనలు మరింత ఉద్ధృతం అవుతాయని హెచ్చరించారు. గత నాలుగు నెలలుగా చైనా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు హాం​కాంగ్​ వాసులు.

ఇదీ చూడండి:హరియాణా: జాతీయ పార్టీలకు అసమ్మతి చిక్కులు

Last Updated : Oct 6, 2019, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details