హాంకాంగ్ సింగ్ యీ జిల్లాలోని 35 అంతస్తుల భవనంలో నివాసముంటున్న ఇద్దరి వ్యక్తులకు వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ భవనం మొత్తాన్ని ఖాళీ చేయించారు.
సుమారు 3000వేల మంది నివాసముంటున్న ఈ భవనంలో ఎవరి నుంచి వ్యాపించిందో తెలుసుకునేందుకు వారందరినీ తెల్లవారుజామున ఖాళీ చేయించారు. వేరే ప్రాంతానికి తరలించారు. వీరిలో నలుగురికి వైరస్ లక్షణాలు కనిపించగా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య కార్యదర్శి సోఫియా టాన్ తెలిపారు.
నేను నా కుమారుడు, కోడలు, మనవరాళ్లు, నా భర్తతో కలిసి జీవిస్తున్నాను. మాకు కావాల్సిన ముసుగులు లేవు కాబట్టి ఎక్కువగా బయటకు వెళ్లలేదు. నా మనవరాళ్లను హాలులో ఆడుకోవడానికి కూడా నేను అనుమతించలేను. ఇక ఇప్పుడైతే ఇంట్లోనే ఉండలేము.