హాంకాంగ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గత కొన్ని నెలలుగా హాంకాంగ్‌లో జరుగుతున్న నిరసనలకు ప్రజల మద్దతును ఎన్నికల ఫలితాలు ప్రస్ఫుటం చేశాయి.
ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో 71 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం ఉదయం వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 18 కౌన్సిల్ జిల్లాల్లో ఊహించని విధంగా ప్రజాస్వామ్య అనుకూల అభ్యర్థులు మెజారిటీని సొంతం చేసుకున్నారు. మొత్తం 452 స్థానాలకు గానూ 201 స్థానాల్లో ప్రజాస్వామ్య అనుకూల అభ్యర్థులు గెలుపుబావుటా ఎగరేశారు.