తెలంగాణ

telangana

కారు పార్కింగ్​ కోసం రూ.7కోట్లు ఖర్చు పెట్టారు!

మీ కారు ఎన్ని లక్షలు పెట్టి కొన్నారు..? మరి మీ పార్కింగ్​ స్థలం ఎన్ని కోట్లు పెట్టి కొన్నారు? ఇప్పుడు హాంగ్​కాంగ్​లో ఏ వ్యాపారవేత్తను కదిలించినా ఇవే మాటలు. అదేంటి కారు లక్షల్లో కొనుక్కుని పార్కింగ్​కు కోట్లు ఖర్చు పెడతారా అంటారా? అవును మరి అక్కడ వాహనం పార్క్​ చేయాలంటే కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే!

By

Published : Oct 24, 2019, 5:51 PM IST

Published : Oct 24, 2019, 5:51 PM IST

కారు పార్కింగ్​ కోసం రూ.7కోట్లు ఖర్చు పెట్టారు!

వాహనాలు నిలిపేందుకు పార్కింగ్​ స్థలానికి మిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు హాంగ్​కాంగ్​ వ్యాపారవేత్తలు.

ది-సెంటర్లో యమరేటు!

ది-సెంటర్‌ హాంగ్​కాంగ్​ నగరంలోనే ఐదవ ఎత్తైన ఆకాశహర్మ్యం. అక్టోబర్ 2017లో ఓ హాంగ్ కాంగ్ ధనవంతుడు 5 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చించి ఈ వాణిజ్య భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ బిల్డింగ్​ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్యాలయ భవనంగా అవతరించింది. ఇక్కడ పార్కింగ్​ ధరలూ అంతే ఖరీదైనవిగా ఉంటాయి.
ఇక్కడ పార్కింగ్​ స్థలం ధర అక్షరాలా 7.6 మిలియన్ల హాంగ్​కాంగ్ డాలర్లు. అంటే సుమారు రూ. 7 కోట్లు. ఇంత భారీ ధరకు పార్కింగ్​ స్థలానికి కొన్నవారి జాబితాలో ఇటీవలే చేరారు వ్యాపారవేత్త జానీ ష్యుంగ్ షూన్యీ.

"ద-సెంటర్​లో చాలా మంది యజమానులు ఫైనాన్స్, ఇతర వ్యాపారాలలో ఉన్నారు. ఈ వ్యాపారవేత్తల కార్యాలయాల విలువతో పోల్చితే, ఈ పార్కింగ్​ స్థలం ధర పెద్ద ఎక్కువేం కాదు."
-స్టాన్లీ పూన్, సెంటలైన్ కమర్షియల్ మేనేజింగ్ డైరెక్టర్

ఈ పార్కింగ్​ స్థలం ధర... హాంగ్​కాంగ్​ వార్షిక తలసరి వేతనానికి 30 రెట్లు ఎక్కువ. అంత మొత్తం వెచ్చిస్తే లండన్​లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పే చెల్సియాలో సింగిల్ బెడ్​రూమ్​ అపార్ట్​మెంట్​ సొంతం చేసుకోవచ్చు. అయినా... తమ వాహనాలను సురక్షితంగా నిలిపేందుకు అడిగినంత ధర చెల్లిస్తున్నారు హాంగ్​కాంగ్​ వ్యాపారవేత్తలు.

మాంద్యం ఓవైపు...

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హాంగ్​కాంగ్​ కొద్ది నెలలుగా హోరెత్తుతోంది. వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయి... అక్కడి ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో పార్కింగ్​ కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడం... చర్చనీయాంశమైంది. హాంగ్​కాంగ్​లోని ఆర్థిక అసమానతలకు ఈ పరిణామం అద్దంపడుతోందన్నది కొందరు విశ్లేషకుల మాట.

ఇదీ చూడండి:తొలి మ్యాచ్​లోనే 'ఠాక్రే' సూపర్​ హిట్​- 'కుర్చీ'యే టార్గెట్​!

ABOUT THE AUTHOR

...view details