తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇంట్లో చేసే మాస్కులకు రెండు పొరలు తప్పనిసరి

ఇంట్లో తయారు చేసే మాస్కులే కరోనా వైరస్ నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే ఈ మాస్కులకు కనీసం రెండు లేదా మూడు పొరలు ఉంటేనే వైరస్ బారిన పడకుండా ఉండగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన అధ్యయనం థోరాక్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది

Homemade-mask-works-Best-says-UNSW
ఇంట్లో చేసే మాస్కులకు కనీసం రెండు పొరలుంటేనే రక్షణ!

By

Published : Jul 24, 2020, 9:07 PM IST

కరోనా బారిన పడకుండా మాస్కులు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి. మార్కెట్​లో లభించే ఇతర మాస్కులతో పోల్చితే ఇంట్లో తయారు చేసుకునే మాస్కులే ఉత్తమమని ఇప్పటికే పలువురు నిపుణులు తెలిపారు. అయితే ఇంట్లో తయారు చేసే మాస్కులకు కనీసం రెండు పొరలు ఉంటేనే వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా నిరోధించగలవని తాజా పరిశోధనలో తేలింది. వీలైతే మాస్కును మూడు పొరలతో తయారు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మాస్కుల నాణ్యత, వైరస్‌ను నిరోధించే సామర్థ్యంపై ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌వేల్స్‌కు చెందిన నిపుణులు పరిశోధన జరిపారు. ముఖ్యంగా ఒకేపొరతో ఉండే సర్జికల్‌ మాస్క్‌, ఇంట్లో వస్త్రంతో రెండు పొరలతో తయారుచేసిన మాస్కును పోల్చి చూశారు. దీనికోసం ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌తోపాటు అత్యాధునిక‌ వీడియో కెమెరాలను ఉపయోగించారు. సింగిల్‌ లేయర్‌తో తయారు చేసిన మాస్కు కంటే రెండు లేయర్లతో ఇంట్లో తయారు చేసిన మాస్క్ ‌నుంచి తక్కువ తుంపర్లు బయటకు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దగ్గు, తుమ్ము వల్ల వచ్చే తుంపర్ల వ్యాప్తిని నిరోధించడంలో ఇంట్లో తయారుచేసిన మాస్క్‌ మెరుగ్గా ఉన్నట్లు తేల్చారు. ముక్కు, నోరును పూర్తిగా కప్పి ఉంచడానికి ఇవి అనువుగా ఉన్నట్లు గమనించారు.

మూడు లేయర్లతో కూడిన సర్జికల్ మాస్క్‌ కూడా ఉత్తమమైందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ రైనా మెక్లెంటైర్‌ స్పష్టం చేశారు. ఈ పరిశోధనకు సంబంధించిన అధ్యయనం థోరాక్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఇదీ చూడండి:కరోనా ట్యాబ్లెట్ ఫవిపిరవిర్ ఇక మరింత చౌక!

ABOUT THE AUTHOR

...view details