కరోనా నానాటికీ విజృంభిస్తున్న వేళ దానిని అడ్డుకునేందుకు పలు సృజనాత్మక ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. వైరస్ నుంచి తప్పించుకోవాలంటే ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మార్గం. ఇందుకోసం సింగపూర్‌లోని నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్‌టీయూ)కి చెందిన పరిశోధకులు ఎక్స్‌డీబోట్ అనే రోబోను సృష్టించారు.
30 మీటర్ల దూరంలో ఉంటూనే..
చక్రాల సాయంతో నడిచే ఈ రోబో... భారీ విస్తీర్ణం ఉన్న ప్రదేశాల్లో కరోనా వైరస్ నిరోధక ద్రావణాలను చకచకా పిచికారీ చేసేస్తుంది. దీనికి ఉన్న 6-యాక్సిస్ రోబోటిక్ ఆర్మ్... అచ్చం మనుషుల చేతుల మాదిరిగా పని చేస్తుంది. 30 మీటర్లు దూరంగా ఉండి లాప్‌ట్యాప్/ట్యాబ్‌ల సాయంతో దీనిని నియంత్రించవచ్చు. కొన్ని సందర్భాల్లో స్వతంత్రంగా వ్యవహరించేలా ఈ రోబోను రూపొందించడం విశేషం.
దీనికి అమర్చిన విద్యుదావేశాలతో కూడిన నాజిల్స్ ద్వారా పిచికారీ చేయడం వల్ల ఉపరితలాలపై ఎక్కడా ఖాళీలు లేకుండా ద్రావణాల తుంపరలు సరిగ్గా పరుచుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:'సిక్కుల పవిత్ర కట్టడాన్ని పరిరక్షించండి'